వికారాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

వికారాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
X

మన తెలంగాణ - హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొమ్రాస్‌పేట మండలం నాందార్‌పూర్ వద్ద కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు, కారులో ఉన్న మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన నలుగురిని స్థానికులు, పోలీసులు సహాయంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story