కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రీ, కొడుకుల దారుణం

కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రీ, కొడుకుల దారుణం
X

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా కక్కర్ వాడలో దారుణం చోటు చేసుకుంది. కూతురు తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కూతురు కుటుంబ సభ్యులు అబ్బాయి కుటుంబంపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటన ఝరాసంగం మండలంలో జరిగింది. విషయం గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఇంటికి చేరుకుని మంటలు అర్పేశారు. ఈ ఘటనపై అల్లుడు తండ్రి, కొడులపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి విఠల్, కుమారుడు పాండును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags

Next Story