వరంగల్ లో అగ్నిప్రమాదం.. రెండు దుకాణాలు దగ్ధం!

X
హైదరాబాద్: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెహ్రూ సెంటర్ మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ ఒక ఫెర్టిలైజర్ దుకాణం, దాని పక్కనే ఉన్న ఆటోమొబైల్ దుకాణంలో మంటలు చెలరేగి రెండు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు సమాచారం. దుకాణాల్లోని సామగ్రి అంతా కాలి బూడిదవడంతో సుమారు రూ. 25 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
