భద్రాద్రిలో లారీని బైక్ ఢీకొని ఇద్దరు మృతి

X
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టేకులపల్లి మండలం ఆరో మైలు వద్ద లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Next Story
-
Home
-
Menu
