ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి!

X
మన తెలంగాణ – న్యూస్ డెస్క్: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుగ్గరామేశ్వరం సమీపంలోని మలుపు వద్ద ఆటో, లారీ ఢీకొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలతో పాటు ఆటో డ్రైవర్ కూడా మృతి చెందాడు. వికారాబాద్‌లోని పెండ్లిమడుగు నుంచి కేరెల్లికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను నాగేష్, చంద్రమ్మ, పార్వతమ్మ, సరితగా పోలీసులు గుర్తించారు.
Tags
Next Story
-
Home
-
Menu
