ఇవి బ్యాటరీలకు ఆధార్ తరహా నెంబర్లు

న్యూఢిల్లీ ః కేంద్ర రవాణా మంత్రిత్వశాఖ శనివారం ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల సంబందిత కీలక ముసాయిదా మార్గదర్శకాలు వెలువరించింది. ఇవి కార్లు ఇతర వాహనాలకు అత్యవసరంగా వాడే బ్యాటరీలకు ఇకపై ఆధార్ తరహా నిర్థిష్ట క్రమ సంఖ్యలను పొందుపర్చేందుకు ప్రతిపాదించారు. సమర్థవంతమైన రీ ఛార్జింగ్‌కు, వీటి ఉనికి తెలుసుకునేందుకు (ట్రెసిబులిటి) ఈ నెంబర్ల ప్రక్రియ ఉపయోగపడుతుందని మార్గదర్శకాలలో మంత్రిత్వ శాఖ తెలిపింది. ముసాయిదా అమలులోకి వస్తే బ్యాటరీల ఉత్పత్తిదార్లు లేదా దిగుమతిదార్లు తప్పనిసరిగా వీటికి 21 అంకెల బ్యాటరీ ప్యాక్ ఆధార్ నెంబరు అంటే బిపిఎఎన్‌ను తప్పనిసరిగా పొందుపర్చుకోవల్సి ఉంటుంది.
లేకపోతే ఇటువంటి బ్యాటరీలు ఉనికిలోనికి రావడానికి వీలుండదు. బిపిఎఎన్ అధికారిక పోర్టల్‌లో సంబంధిత బ్యాటరీ ప్యాక్ డైనమిక్ డేటాను జతచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు బ్యాటరీల ఉత్పత్తిదార్లకు ఈ నిబందన తప్పనిసరి చేస్తారు. మార్కెట్‌లోకి పంపే ప్రతి బ్యాటరీకి ఈ నెంబరు నిర్థిష్టంగా ఉండటంతో వాటిని గుర్తించేందుకు వీలేర్పడుతుంది. రీసైక్లింగ్ ప్రక్రియ సులభతరం అవుతుందని అధికార వర్గాలు తమ ప్రకటనలో తెలిపాయి.
Tags
-
Home
-
Menu
