ఎసిబికి చిక్కిన జిల్లా యువజన క్రీడల అధికారి

ఎసిబికి చిక్కిన జిల్లా యువజన క్రీడల అధికారి
X

బిల్లుల చెల్లించేందుకు కాంట్రాక్టర్‌ను రూ. లక్ష డిమాండ్ చేసిన జిల్లా యుజవన, క్రీడల అధికారి జక్కు రాజశేఖర్‌రెడ్డిని, కంప్యూటర్ ఆపరేటర్‌ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఎసిబి అధికారుల వివరాల ప్రకారం.. క్రీడాకారులకు ఆహారం సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కు రూ. 3.10 లక్షల క్యాటరింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్‌ను రాజశేఖర్‌రెడ్డి రూ. లక్ష డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రాజశేఖర్‌రెడ్డి వేధింపులు భరించలేక బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో పక్కా ప్రణాళిక రచించిన ఎసిబి అధికారులు రాజశేఖర్‌రెడ్డితో పాటు కంప్యూటర్ ఆపరేటర్‌ను డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకున్నారు.ఈ ఘటనతో జిల్లా క్రీడల శాఖలో కలకలం రేగింది. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Tags

Next Story