ఎసిబికి చిక్కిన గోవిందరావుపేట తహసీల్దార్

ఎసిబికి చిక్కిన గోవిందరావుపేట తహసీల్దార్
X

భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లంచం తీసుకుంటూ గోవిందరావు పేట మండల తహసీల్దార్ ఎన్. సృజన్ కుమార్ శుక్రవారం ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన ఓ రైతు గత ఏడాది ఆగస్టులో మృతి చెందారు. ఆయనకు చెందిన భూమిని తన పేరు పైకి మార్చుకునేందుకు ఆయన కుమార్తె మండల మీ-సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో గత మే నెలలో తహసీల్దార్ ను కలవగా, భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి

రూ.14వేలు లంచం డిమాండ్ చేశారని బాధితురాలి భర్త ఎసిబికి ఫిర్యాదు చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఎసిబిని ఆశ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. శుక్రవారం రూ.14 వేల నగదును తహసీల్దార్ కు అందజేస్తుండగా ఎసిబి డిఎస్పి సాంబయ్య ఆధ్వర్యంలో ఇన్ స్పెక్టర్లు రాజు, పున్నం, ప్రభాకర్ లు దాడి చేసి పట్టుకున్నారు.పట్టుబడిన తహసీల్దార్ ను శనివారం వరంగల్ ఎసిబి కోర్టులో హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Tags

Next Story