ఎసిబి వలలో జిపిఒ

X
పేరు సరిచేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ గ్రామ పరిపాలనా అధికారి గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మకూరు గ్రామ పంచాయతీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం ఆత్మకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బాధితుడు మల్లేశ్‌కు చెందిన పాస్‌బుక్‌లో పేరు తప్పుగా నమోదైంది. ఆ పేరును సరిదిద్దాల్సిందిగా కోరగా, జిపిఒ రాజేశ్ రూ.5,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని మల్లేశ్ ఎసిబి అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రసాయనాలతో కూడిన రూ.5,000 నగదును మల్లేశ్ నుంచి రాజేశ్ తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారిని అదుపులోకి తీసుకున్న ఎసిబి బృందం, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించింది
Next Story
-
Home
-
Menu
