ఎసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్..

X
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సబ్‌జైల్‌లో డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ రూ. 10,000 లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. సబ్‌జైల్‌లో ఉన్న ఒక ఖైదీకి అదనపు సదుపాయాలు కల్పించేందుకు డిప్యూటీ జైలర్ రూ. 10,000 లంచం డిమాండ్ చేశాబ. బాధితుడు లంచం ఇవ్వబం ఇష్టం లేక ఎసిబి అధికారులను సంప్రదించాడు.బాధితుడు ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు రంగంలోకి దిగి పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. జైలు పరిసర ప్రాంతంలో రూ. 10,000 లంచం డబ్బులు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు డిప్యూటీ జైలర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు కెమికల్ పరీక్షలు నిర్వహించి నేరాన్ని నిర్ధారించారు. అనంతరం అధికారిపై కేసు నమోదు చేసి ఎసిబి ప్రత్యేక కోర్టుకు తరలించారు.
Next Story
-
Home
-
Menu
