నిజామాబాద్ కొర్పొరేషన్ కార్యాలయంలో ఎసిబి సోదాలు

నిజామాబాద్ కొర్పొరేషన్ కార్యాలయంలో ఎసిబి సోదాలు
X

నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఎసిబి) బుధవారం సోదాలు నిర్వహించారు. మున్సిపల్ అధికారుల గుండెల్లో అలజడి మొదలయ్యింది. ఉదయం ఎసిబి అధికారులు ముకుమ్మడిగా టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లోకి వచ్చి ప్రధాన ద్వారం లోపల నుంచి గడియ పెట్టి సోదాలు నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలకు వత్తాసు పలుకుతూ, మామ్మూళ్ల మత్తులో అనుమతులు ఇస్తున్నారని ఇటీవల టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులపై వరుసగా అవినీతి ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహించినట్టు సమాచారం. టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఎసిబి బృందం ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. కాగా, తనిఖీల అనంతరం పూర్తి సమాచారం వెల్లడిస్తామని ఎసిబి అధికారి ఒకరు తెలిపారు.

Tags

Next Story