ఎసిబికి చిక్కిన పెద్దపల్లి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్

ఎసిబికి చిక్కిన పెద్దపల్లి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్
X

పెద్దపల్లి: ఓ కేసులో నిందితుడిని శిక్ష నుంచి తప్పించేందుకు లంచం డిమాండ్ చేసిన పెద్దపల్లి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పిపి) రవీందర్‌ను ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ధర్మారం మండలం రచ్చపల్లికి చెందిన భూ వివాదం, హత్య కేసులకు సంబంధించి ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుడికి అనుకూలంగా వాదించేందుకు పిపి పి.వి. రవీందర్ రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు రూ.1.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రణాళిక ప్రకారం బుధవారం ఉదయం బాధితుడు నేనుగా పిపి నివాసానికి వెళ్లి రూ.1.50 లక్షలు లంచం ఇస్తుండగా ఎసిసి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ దాడుల్లో పిపి రవీందర్‌తో పాటు ఆయన అనుచరుడు రెడ్డి రాజుల రాజన్నను కూడా ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags

Next Story