లంచం.. కీసర సిఐ, ఎస్ఐలను అరెస్ట్ చేసిన ఎసిబి అధికారులు

Arrest
X

మేడ్చల్‌: కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించి ఇద్దరు పోలీసులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ.5 లక్షలు లంచం తీసుకున్న కీసర సిఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్‌రెడ్డిని ఎసిబి అదుపులోకి తీసుకుంది. ఓ కేసు విషయంలో నిందితుడికి స్టేషన్ బెయిల్‌ ఇచ్చేందుకు సిఐ ఆంజనేయులు రూ.10 లక్షలు డిమాండ్ చేయగా... రూ.5లక్షలకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో కీసర చెరువుగట్టు వద్ద గణేష్ నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఎస్ఐ రూ. 5లక్షలు లంచం తీసుకున్నాడు. అదే సమయంలో అక్కడికి చేరుకుని సోదాలు చేపట్టిన ఎసిబి అధికారులు.. ఎస్ఐ అరెస్ట్ చేశారు. అనంతరం సిఐ ఆంజనేయులును కూడా ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story