వనపర్తి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎసిబి అధికారుల తనిఖీలు

వనపర్తి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో  ఎసిబి అధికారుల తనిఖీలు
X

వనపర్తి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.అవినీతి ఆరోపణలు రావడంతో శుక్రవారం మధ్యాహ్నం 3: 30 నిమిషాలకు మహబూబ్నగర్ రేంజ్ డిఎస్పి బాలకృష్ణతోపాటు ఇద్దరు ఎస్సైలు సిబ్బందితో కలిసి కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్స్, కార్యాలయసిబ్బంది,వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారిని బయటికి వెళ్లకుండా లోపలనే ఉంచి వారితో ఉన్న డాక్యుమెంట్ లను క్షుణ్ణంగా పరిశీలించి, రైటర్స్,కార్యాలయ సిబ్బంది వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు.లోపల ఉన్న ప్రతి ఒక్కరి వివరాలతో పాటు,ఏ పని నిమిత్తం వచ్చారనే సమాచారంను సేకరించారు. అనంతరం డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ గత కొంత కాలంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని,

ఈ నేపథ్యంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది.ఈ తనిఖీల్లో పలు రికార్డులతో పాటు కార్యాలయ,డాక్యుమెంట్ రైటర్స్ సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం.పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాక మీడియాకు వివరాలు వెల్లడిస్తాం.జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు,సిబ్బంది లంచం అడిగితే నేరుగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064,91543 88974 కి సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం అని తెలిపారు. అనంతరం వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారిని అక్కడ నుంచి పంపించేసి కార్యాలయంలో అధికారుల సోదాలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడించేందుకు సమయం పడుతుందని తెలిపారు.


ఉలిక్కిపడ్డ అధికారులు

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విస్తృత అకస్మిక తనిఖీల నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖలలో పనిచేసే అధికారులు,సిబ్బంది ఉలికిపడ్డారు.ఈ సమాచారం తెలుసుకున్న పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఆ సమయానికి కార్యాలయాల్లో ఉండకుండా బయటికి వెళ్లారు.మొదట ఏసీబీ జిల్లాకు వచ్చి తనీఖిలు చేస్తున్నారనే సమాచారం లేక పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.రవాణా శాఖ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారనే తప్పుడు సమాచారం రావడంతో పలువురు మీడియా సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆరా తీయగా...అక్కడ పనిచేసే ఏజెంట్లు ,సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అకస్మిక తనిఖీలు చేస్తున్నారనే సమాచారం రావడంతో పలు శాఖల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


Tags

Next Story