కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎసిబి దాడులు

కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎసిబి దాడులు
X

కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ చేపట్టిన సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం 10 గంటలకు మొదలైన సోదాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. ముఖ్యంగా శానిటేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖలపై వచ్చిన ఫిర్యాదులపై ఏసీబీ ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. పట్టణంలో అక్రమ నిర్మాణాలు ప్రభుత్వానికి రూ.కోటికి పైగా నష్టం జరిగిందన్నారు. పట్టణంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు న్నాయి. ఎప్పటి నుంచో వస్తున్న అధికారుల్లో చలనం కనిపించలేదని, పైగా అక్రమ నిర్మాణాల్లో కమీషన్లు తీసుకుని అనుమతులిచ్చారన్న ఆరోపణలున్నాయి. ఏసీబీ తనిఖీల్లో కూడా ఈ విషయం స్పష్టమైంది. 2025-26 సంవత్సరంలో అనధికార నిర్మాణాలపై 47 ఫిర్యాదులు వచ్చిన నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి చర్య తీసుకోలేదని ఏసీబీ తనిఖీల్లో తేలింది. పట్టణంలోని కమర్షియల్ షాపుల లైసెన్సులపై ఆరోపణలున్నాయి. 400కు పైగా వాణిజ్య షాపుల ట్రేడ్ లైసెన్స్, రెన్యువల్స్ పెండింగ్‌లో ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది.


ప్రభుత్వానికి రూ.కోటికి పైగా నష్టం: అధికారుల తీరుతో ప్రభుత్వానికి సుమారు రూ. కోటి బకాయిలు ఏర్పడ్డాయని ఏసీబీ పేర్కొంది. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్లలో తేడాలు గుర్తించారు. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మున్సిపల్ అధికారుల ఫ్యుయెల్ ఛార్జీలలో చేతివాటం ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. నెలకు రూ.12.40 లక్షలు కేటాయించిన, సరైన రికార్డులు లేవని అధికారులు గుర్తించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో భారీ వ్యత్యాసం బయటపడింది. కొంతమంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను గైర్హాజరుగా మార్క్ చేసిన పూర్తి నెల జీతం చెల్లించారు. పూర్తి జీతం చెల్లింపుల విషయంలో కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలు గతంలో వినిపించిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. భవన నిర్మాణాల అనుమతులలో జాప్యం ఉందని ఏసీబీ తనిఖీల్లో బట్టబయలయ్యాయి. డిసెంబర్ 2025 నుండి 169 బిల్డింగ్ పర్మిషన్ దరఖాస్తుల్లో 18 ఆలస్యంగా ప్రాసెస్ అయ్యాయని తేలింది. తనిఖీల రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించి తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తామని అధికారులు తెలిపారు.

Tags

Next Story