వందల కోట్ల సంపాదన!.. హన్మకొండ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఎసిబి సోదాలు

X
హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి నివాసాల్లో ఎసిబి అధికారులు అకస్మిక సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల ఎసిబి సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, మిర్యాలగూడలోని నివాసాల్లో సోదాలు చేస్తోంది. ఈ తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఎసిబి గుర్తించినట్లు తెలుస్తోంది. వెంకట్‌రెడ్డిపై అక్రమంగా వందల కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ పాఠశాలకు అనుమతి విషయంలో 60 వేల రూపాయలు లంచం తీసుకుంటూ వెంకట్ రెడ్డి ఎసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ క్రమంలోనే ఎసిబి అధికారులు మెరుపు దాడులకు దిగినట్లు సమాచారం.
Next Story
-
Home
-
Menu
