ఎసిబికి చిక్కిన ట్రెజరీ సీనియర్ అసిస్టెంట్

ఎసిబికి చిక్కిన  ట్రెజరీ  సీనియర్ అసిస్టెంట్
X

నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట సబ్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఎసిబి వలకు చిక్కాడు. సీనియర్‌అసిస్టెంట్ వెంకటయ్య ఓ ఉద్యోగికి సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. ఆగస్టు 14న రూ.3 వేలు.. ఆగస్టు 18న రూ.22 వేలను ఫోన్ పే ద్వారా బాధితుడి నుంచి తీసుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పూర్తి వివరాలు తెలుసుకున్న ఎసిబి అధికారులు మంగళవారం సాయంత్రం అచ్చంపేటలో సీనియర్ అసిస్టెంట్‌ను అరెస్టు చేశారు. బుధవారం నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎసిబి డిఎస్పీ బాలకృష్ణ తెలిపారు.

Tags

Next Story