భూపాలపల్లి జిల్లా కోర్డులో ఎసిబి రైడ్స్.. లంచం తీసుకుంటూ పట్టు బడ్డ ముగ్గురు సిబ్బంది

భూపాలపల్లి జిల్లా కోర్డులో ఎసిబి రైడ్స్.. లంచం తీసుకుంటూ పట్టు బడ్డ ముగ్గురు సిబ్బంది
X

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్డులో శుక్రవారం వరంగల్ ఎసిబి అధికారులు డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో రైడ్స్ నిర్వహించి రూ.5000 లంచం తీసుకుంటుండగా ముగ్గురు కోర్టు సిబ్బంది పాలకుర్తి సాయి చరణ్(స్టెనోగ్రాఫర్), అటెండర్లు పున్నం రజిత, కొమ్ము సునీతలు పట్టుకున్నారు. డిఎస్పీ వివరాల ప్రకారం..భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి శివారులో ఒక వ్యక్తికి 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఇట్టిభూమిపై పక్కనున్న వ్యక్తి 1984లో సివిల్ దావా వేయగా వివిద కోర్టుల తీర్పులతో జిల్లా కోర్టు వరకు వచ్చిందని, గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో జిల్లా ప్రెన్స్‌పల్ జడ్జి పిర్యాధు దారునికి అనుకూలంగా తీర్పు ఇచ్చారని, ఆతీర్పు కాఫీ కొరకు ఫిబ్రవరి 10న చాలన్‌కట్టి కాఫీ సెక్షన్‌లో అడుగగా రూ.20వేల లంచం డిమాండ్ చేశారని ఇచ్చకోలేక అతను మల్లి అదేనెల 13న వచ్చి అంత ఇవ్వలేనని అడుగగా రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్

చేయగా మూడు రోజులకు ఇస్తానని వెల్లాడని, లంచం ఇచ్చుడు ఇష్టంలేక ఆవ్యక్తి ఎసిబి అధికారులకు పిర్యాదు చేశారని తెలిపారు. శుక్రవారం ఆవ్యక్తి ఎసిబి అధికారులతో చరణ్‌కు లంచం ఇవ్వటానికి రాగా చరన్ అటెండర్లు గా పని చేస్తున్న రజిత ,సునీతలను అప్రోచ్ కావాలని వారికి డబ్బులు ఇచ్చికాఫీ తీసుకోండనిచెప్పగా రజితకు డబ్బులు ఇచ్చి కాఫీ తీసుకొనగా ఆత్వాత సునీత చరణ్ నన్నే తీసుకొమ్మడని ఆడబ్బులు సునీత తీసుకుందని తెలిపారు. ఆ డబ్బులు లంచం డబ్బులు అని వారికి అవగాహణ పూర్థిస్థాయిలో ఉందని తెలిపారు. చరణ్, రజిత, సునీతలను అదుపులోకి తీసుకొని నేడు వరంగల్ ఎసిబికోర్టులో హాజరపుచనున్నట్లు తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064కు సంప్రదించాలని డిఎస్పీతెలిపారు. ఈకార్యక్రమంలోఎసిబి సిబ్బంది ఎస్ రాజు, ఎల్ రాజు, ప్రభాకర్ సిబ్బంది ఉన్నారు.

Tags

Next Story