ఎసిబి వలలో సివిల్ సప్లై అధికారి

ఎసిబి వలలో సివిల్ సప్లై అధికారి
X

రేషన్ డీలర్ వద్ద లంచం తీసుకుంటూ ఓ సివిల్ సప్లై అధికారి ఎసిబి వలలో చిక్కారు. రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న రవీందర్ నాయక్ అవినీతి నిరోధక శాఖ ట్రాప్‌లో పడ్డారు. షాద్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ రేషన్ డీలర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు ఏసిబి అధికారులు వెల్లడించారు. పిడిఎస్ రైస్‌కు సంబంధించిన కేసు క్లియరెన్స్ విషయంలో బాధితుడి వద్ద జిల్లా సివిల్ సప్లై విభాగం డిటి రవీందర్ నాయక్ లంచం డిమాండ్ చేసినట్లు ఏసిబి తెలిపింది. నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న అధికారులు లంచం డిమాండ్ చేసినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఏసిబి అధికారులు ప్రజలకు సూచించారు.

Tags

Next Story