ఎసిబికి పట్టుబడ్డ వెల్దండ విద్యుత్ ఇన్‌ఛార్జి ఏఈ

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల విద్యుత్ ఇన్‌ఛార్జ్ ఏఈ వెంకటేశ్వర్లు రూ.15 వేల లంచం తీసుకుంటుండగా మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎసిబి డిఎస్‌పి జగదీష్ చందర్ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వెల్దండ మండల కేంద్రం పరిధిలోని చొక్కన్నపల్లి గ్రామ సమీపంలోని ఓ ఫామ్ హౌజ్‌లో విద్యుత్ మీటర్ ఏర్పాటు కోసం విద్యుత్ ఏఈ రూ. 20 వేలు డిమాండ్ చేయగా ఫిర్యాదు దారుడు రూ. 15 వేలకు ఒప్పందం కుదుర్చుకొని ఫామ్ హౌజ్‌లో నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలిపి వెల్దండ విద్యుత్ సబ్ స్టేషన్‌కు తరలించారు. ఫిర్యాదుదారుడు ఈనెల 5వ తేదీన ఎసిబి అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పూర్తి స్థాయి
ఆధారాలతో దాడులు నిర్వహించి కస్టడీలోకి తీసుకున్నట్లు ఎసిబి డిఎస్పి పేర్కొన్నారు. ఇదే సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో గల ఏఈ నివాసంలో మరొక బృందం సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎసిబి డిఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఎవరైనా పనులు చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ అధికారుల టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేసి సమాచారం అందజేయాలని ఏసిబి డిఎస్పి సూచించారు. అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వస్తే ఆ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటామని పేర్కొన్నారు.
-
Home
-
Menu
