ప్రణయ్ హత్య కేసు నిందితుడి మృతి

ప్రణయ్ హత్య కేసు నిందితుడి మృతి
X

తెలంగాణలో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం ఇష్టంలేని యువతి తండ్రి మారుతి రావు, సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించాడు. సుపారీ గ్యాంగ్‌లో ఉన్న అబ్దుల్ బారీని ఏ4గా పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ, ప్యారసభాగ్‌కు చెందిన అబ్దుల్ బారీ గతంలో గుజరాత్ రాష్ట్ర హోంమంత్రి హరేన్ పాండే హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ప్రణయ్ హత్య కేసులో జీవిత ఖైదు శిక్షపడగా చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే జైలులోని అబ్దుల్ బారీకి గుండేలో నొప్పి రావడంతో వెంటనే సిబ్బంది గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.

Tags

Next Story