బాలికపై లైంగిక వేధింపులు.... సిరిసిల్లలో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష...

రాజన్నసిరిసిల్ల: పోక్సో కేసులో సిరిసిల్ల కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన (పోక్సో) కేసులో నిందుతుడికి 20 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 500 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధికా జైస్వాల్ మంగళవారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికను గోరింటాల గ్రామానీకి చెందిన కోటగిరి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపులకి గురి చేయగా బాధితురాలి తండ్రి ఫిర్యాదు మెరకు గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అప్పటి సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి దర్యాప్తు అనంతరం నిందితుడిని రిమాండ్ కి తరలించారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం జరిగింది.
కోర్టు విచారణలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో కోర్టు మానిటరింగ్ ఎస్ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సిఎంఎస్ కానిస్టేబుళ్ నవీన్, పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల కోర్టులో 15 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరుపున గత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించగా, శాస్త్రీయ ఆధారాలు, సాక్షులను పరిశీలించిన న్యాయమూర్తి నేరము రుజువు కావడంతో నిందితుడైన కోటగిరి శ్రీనివాస్ కి 20 సంవత్సరాలు జైలు శిక్షతో 5000 జరిమాన విధించారు.
సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరని , శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా న్యాయ విచారణ, న్యాయ నిరూపణ నిర్వహించి నిందితులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, అప్పటి డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రస్తుత డిఎస్పీ నాగేంద్రచారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, గంబీరావుపేట ఎస్.ఐ శ్రీకాంత్, కోర్టు మానిటరిoగ్ ఎస్.ఐ రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సిఎంఎస్ కానిస్టేబుల్ నవీన్, పొక్సో కోర్టు కానిస్టేబుల్ వెన్నెల లను జిల్లా ఎస్పీ అభినందించారు
-
Home
-
Menu
