పని మనిషిపై అత్యాచారం.. ‘దురంధర్’ నటుడు అరెస్ట్

X
ముంబై: అత్యాచారం కేసులో ఇటీవల సూపర్‌హిట్‌గా నిలిచిన ‘దురంధర్’ చిత్రంలో నటించిన నదీమ్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాల్వానీ పోలీసులు నదీమ్‌ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. 41 ఏళ్ల ఓ మహిళ నదీమ్ ఇంట్లో 2015 నుంచి పని చేస్తోంది. పెళ్లి చేసుకుంటానని అతడు నమ్మించాడు. కానీ, ఆమె వివాహం గురించి ఎన్నిసార్లు అడిగినా నదీమ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. నదీమ్ పలుమార్లు అత్యాచారం చేశా చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ మహిళ ఆరోపణలు ధృవీకరించామని, ఈ మేరకు అరెస్ట్ చేశామని పోలీసు అధికారి వెల్లడించారు.
Next Story
-
Home
-
Menu
