యాదాద్రిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

X
అడ్డగూడూర్: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం బొడ్డుగూడెం వద్ద హైవే పై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆర్ టిసి బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. చౌల్లారామారం గ్రామానికి చెందిన సోమన్న, బసవన్నఅని సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వలిగొండ నుంచి తిరుమలగిరి వరకు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివిధ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. భారీ వాహనాలు ఎక్కువ వేగంతో వెళ్లడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
