కపాస్ కిసాన్ యాప్ రద్దు చేయాలి: మాజీ మంత్రి జోగు రామన్న

Withdrawal of Kapas Kisan App
X

Withdrawal of Kapas Kisan App

పంట కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో అఖిలపక్ష సమన్వయ కమిటీ ఆదిలాబాద్ బోరజ్ వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. బిఆర్‌ఎస్‌తో సహా అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈధర్నాలో మాజీ మంత్రి జోగు రామన్న, అఖిలపక్ష, రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులతో కలిసి నేతలు రోడ్డుపై రొట్టెలు తిని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. పోలీసులను పూర్తిస్థాయిలో మోహరించిన ధర్నా కార్యక్రమానికి రైతులు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేశారు. వివిధ గ్రామాల నుంచి రైతులు ఎడ్ల బండ్లపై తరలివచ్చి నిరసనలో,భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ..సిసిఐ నిబంధనలు, తొలగించాలని, క్వింటాళ్ల పత్తి పరిమితిని తీసివేయాలని డిమాండ్ చేశారు. కపాస్ కిసాన్ యాప్ తో పాటు సిసిఐ నిబంధనల కారణంగా రైతులు పడరాని పాట్లు పడుతున్నప్పటికీ స్థానిక ఎంఎల్‌ఎ,

ఎంపి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల పాటు రైతులకు ఇబ్బంది లేదని మాయమాటలు చెప్పిన స్థానిక ఎంఎల్‌ఎ రైతుల నుండి వస్తున్న వ్యతిరేకతతో, సిఎం రేవంత్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలుస్తున్నారని, రైతులతో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రైతుల ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్, న్యూడెమోక్రసీ రాష్ట్రనాయకుడు టి. శ్రీనివాస్, సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకుడు నంది రామయ్య, అఖిలపక్ష రైతు నాయకులు బండి దత్తాత్రి, విజ్జగిరి నారాయణ, కొండ రమేష్, గోవర్ధన్ యాదవ్, లోకారి పోశెట్టి, చిలుక దేవిదాస్, కేమ లక్ష్మణ్, జగన్, వెంకట నారాయణ. అలాల్ అజేయ్, యూనిస్ అక్బనీ, సాజిత్ ఉద్దీన్, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story