‘జి2’ విడుదల అప్పుడే

X
బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ గూఢచారికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న మూవీ ‘జి2’ రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. 2027 ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ గూఢచారి సక్సెస్‌ను ఆధారంగా తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈసారి ఏజెంట్ 116గా వామికా గబ్బి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.
Next Story
-
Home
-
Menu
