ఆస్తి కోసం పెంచిన తల్లిని చంపిన దత్తత కొడుకు

ఆస్తి కోసం పెంచిన తల్లిని చంపిన దత్తత కొడుకు
X

సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నీరుకుల్ల గ్రామ పరిధి లోని కోమండ్లపల్లి కి చెందిన ఐలవేణి భాగ్యమ్మ కు సంతానం లేకపోవడంతో, తన మరిది కుమారుడైన ఐలవేని సాయి (28 ) అనే అతన్ని దత్తత తీసుకుని పెంచింది..గత 4 నెలల క్రితం భాగ్యమ్మ భర్త రాజయ్య మృతి చెందాడు. నిందితుడు సాయి మద్యానికి బానిసగా మారి ఎలాంటి పనులు చేయకపోవడంతో, మృతురాలు అతడిని తరచుగా మందలించేది.దీనిని మనస్సులో పెట్టుకుని,అదేవిధంగా ఆమెను చంపినట్లయితే ఆమెకు సంబంధించిన ఆస్తి కూడా అతనికే వస్తుందని నిందితుడు తన దత్తత తల్లిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

2026 జనవరి 11వ తేదీన తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఐలవేణి భాగ్యమ్మ అనే పెంచుకున్న తల్లిని హత్య చేయాలనే ఉద్దేశంతో నిందితుడు ఆమెకు మద్యం తాగించి, అనంతరం గొంతు నులిమి హత్య చేశాడని ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. ఈ విషయంలో మృతురాలి బంధువులు నిందితున్ని గట్టిగా నిలదీయడంతో విషయం వెలుగు లోకి వచ్చింది. మృతురాలి అన్న పిట్టల రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై చంద్రకుమార్ కేసు నమోదు చెయ్యగా ,సి ఐ సుల్తానాబాద్ సుబ్బారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story