అద్దెకు ముఖం.. ఆదాయానికి మార్గం

మన తెలంగాణ స్పెషల్ డెస్క్ : కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని రంగా ల్లో మార్పులు చకచకా సాగిపోతున్నాయి. తాజాగా అది ప్రకటనలతో పాటు మైక్రో డ్రామా లు, గేమింగ్ రంగంలోకి కూడి దూరిపోతోంది. ఇకపై ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులు, వ్యా పారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే సె లెబ్రిటీల వెంట పరుగెత్తనక్కర్లేదు. వాళ్లకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్‌లు చెల్లించుకోనక్కర్లేదు. మీకు ముఖ వర్చస్సు, ఆకర్షణీయ రూపం ఉంటే చా లు వాణిజ్య సంస్థలు సెలెబ్రిటీలను వదిలి మీ వెంట పడే రోజు ఎంతో దూరంలో లేదు.
మీకు నటన రాకున్న మీ ముఖాన్ని, రూ పాన్ని అద్దెకిస్తే చాలు.. మిగతా పని వాళ్లే చూ సుకుంటారు. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా నూతన తరహాలో ఆ దాయం మార్గం మీ తలుపుతడుతోంది. ఇందు లో చైనా ముందువరుసలో ఉంది. ఇప్పటికే అక్కడ కొందరు సాధారణ ప్రజలు తమ ముఖాలను డిజిటల్ రూపంలో ఉపయోగించుకునేందుకు కంపెనీలకు లైసెన్స్ ఇస్తున్నారు. కంపెనీలు ఈ డిజిటల్ ముఖాలను ప్రకటనలు, మైక్రో డ్రామా లు, ఆన్‌లైన్ వాణిజ్యం, వీ డియో గేమ్స్ తదితరాల్లో ఉపయోగిస్తున్నాయి.
ఉభయులకూ ఆర్థిక లబ్ధి
విద్యార్థులు, ఉద్యోగులు, రిటైర్డ్ వ్యక్తుల నుంచి ఫొటోలు లేదా చిన్న వీడియోలను సేకరించి ఏఐ మోడళ్లను రూపొందిస్తున్నారు. ఆ తర్వాత వారి డిజిటల్ రూపం వివిధ కంటెంట్‌లో కనిపిస్తుంది. దీంతో వ్యక్తులు అదనపు సమయం కేటాయించకుండానే ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కంపెనీలకు మాత్రం ప్రతిసారి నటులను ఎంపిక చేయడం, షూటింగ్ నిర్వహించడం, సెట్లు ఏర్పాటు చేయడం వంటి ఖర్చులు తగ్గుతాయి.
24 గంటలూ ‘పని’
ఒకసారి డిజిటల్ అవతార్ సిద్ధమైన తర్వాత దాన్ని అవసరానికి అనుగుణంగా పదేపదే ఉపయోగించవచ్చు. వేర్వేరు భాషల్లో మాట్లాడేలా కూడా రూపొందించవచ్చు. దీంతో ఒక వ్యక్తి ముఖం ఒకేసారి అనేక ప్రకటనలు లేదా ఇతర డిజిటల్ కంటెంట్‌లో కనిపించే అవకాశం ఉం టుంది. అయితే దీనితోపాటు వ్యక్తిగత గోప్యత, భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకసారి ముఖానికి సంబంధించిన డిజిటల్ డేటాను ఇచ్చిన తర్వాత అది ఎక్కడెక్కడ ఉపయోగించబడుతోందో పూర్తిగా తెలుసుకోవడం కష్టమవుతుంది. అనుమతి లేకుండా ఉపయోగించడం, డీప్‌ఫేక్‌లు లేదా ఆన్‌లైన్ మోసాలకు వినియోగించే ప్రమాదం కూడా ఉంది.
ఈ ప్రశ్నలకు సమాధానాలేంటీ?
ముఖాన్ని డిజిటల్‌గా ఉపయోగించేందుకు ఇ చ్చిన అనుమతి ఎంతకాలం చెల్లుతుంది? ఏయే సందర్భాల్లో ఉపయోగించవచ్చు? ఆ డిజిటల్ రూపంపై హక్కులు ఎవరికి ఉంటాయి? వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు అవసరం. ఏఐతో ముఖం ఆదాయ వనరుగా మారుతున్న వేళ.. దాని నియంత్రణ, గోప్యతే అసలు సవాలుగా మారుతోంది.
-
Home
-
Menu
