12న వస్తున్న ‘అఖండ 2’

గత వారం డిసెంబర్ 5న రావాల్సిన ’అఖండ 2’ విడుదల ఆగిపోవడంతో నందమూరి అభిమానులు ఎంత నిరాశకు గురయ్యారో అందరికీ తెలిసిందే. సరిగ్గా ప్రీమియర్స్ పడాల్సిన సమయంలో బ్రేక్ పడటంతో ఆ హైప్ మొత్తం ఒక్కసారిగా చల్లబడినట్లయింది. అయితే ఇప్పుడు సమస్యలు ఓ కొలిక్కి రావడంతో మేకర్స్ మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, వారం తిరక్కముందే డిసెంబర్ 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించు కున్నారని తెలిసింది. ఈరోస్ ఇంటర్నేషనల్, - 14 రీల్స్ ప్లస్ మధ్య సమస్యలు ఉండటంతో ‘అఖండ 2’(Akhanda 2) చివరి నిమిషంలో రిలీజ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కారమవడంతో ఈ సినిమా విడుదలకు సిద్ధమైందని సమాచారం.
ఇప్పుడు ఫైనాన్షియల్ క్లియరెన్సులు, డిస్ట్రిబ్యూటర్ల పెండింగ్ చెల్లింపులు పూర్తయితే ‘అఖండ 2’ని డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలిసింది. డిసెంబర్ 11న పెయిడ్ ప్రీమియర్లు, టికెట్ రేట్ల పెంపు కోసం కూడా టీమ్ మరోసారి దరఖాస్తు చేసిందట. ఇక గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త తదితరులు కీలక పాత్రల్లో నటించగా తమన్ సంగీతం అందిస్తున్నారు.
-
Home
-
Menu
