గద్వాల్ లో లారీని ఢీకొట్టిన కారు: ఇద్దరు మృతి

గద్వాల్: జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ తాలూకా ఎర్రవల్లి మండలంలో ఆదివారం తెల్లవారుజామున ఎన్‌హెచ్–44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెన్త్ పఠాలం ఎదురుగా ఉన్న హెచ్‌పి పెట్రోల్ పంప్ సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కారు హైదరాబాద్ నుంచి గద్వాల్ వైపు వెళ్తుండగా ఎర్రవల్లి గ్రామ సమీపంలోని హెచ్ పి పెట్రోల్ పంపు వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో మౌనిక, సాయి కుమార్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో ఇద్దరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ ముఖేశ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను అంబులెన్స్ లో గద్వాల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? అతివేగమా.. డ్రైవర్ నిర్లక్ష్యమా? లేక ఇతర కారణాలా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags
-
Home
-
Menu
