నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం: మీర్‌చౌక్ ఎసిపి

X
హైదరాబాద్: పాతబస్తీలోని మీర్‌చౌక్ ఎసిపి శ్యామ్ సుందర్‌పై లైంగిక వేధింపుల ఆరోఫణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆరోపణలపై ఏసిపి శ్యామ్ సుందర్ స్పందించారు. ‘‘శనివారం సాయంత్రం 6:30 తర్వాత మహిళ ఎసిపి కార్యాలయానికి వచ్చింది. మహిళ మాట్లాడుతున్న క్రమంలో నాతో సిసి, హోమ్ గార్డ్ ఇద్దరు ఉన్నారు. మహిళ ఆరోపణల్లో వాస్తవం లేదు. మహిళ దళిత అని చెప్పడంతో నాంపల్లి ఎమ్మార్వొకి లేఖ రాసాము. ఎమ్మార్వొ నుండి తిరిగి మాకు లేఖ అందింది దాంట్లో మహిళకు జారీ చేసిన కుల సర్టిఫికెట్ మా కార్యాలయం నుండి ఇవ్వలేదు అంటూ రిపోర్ట్ ఇచ్చారు. అదే విషయం నిన్న మహిళకు చెప్పాము తిరిగి కావాలని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలపై విచారణ జరిపిన నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.’’ అని శ్యామ్ సుందర్ తెలిపారు.
Next Story
-
Home
-
Menu
