టి-20 సిరీస్‌కి సిద్ధం.. స్టార్ ఆటగాడు జట్టు నుంచి ఔట్?

భారత్‌లో సౌతాఫ్రికా జట్టు పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌ని 2-0 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఇరు జట్లు టి-20 సిరీస్‌కి సిద్ధమవుతున్నాయి. మంగళవారం (డిసెంబర్ 9) తొలి టి-20 మ్యాచ్ జరుగనుంది. అయితే వన్డే సిరీస్‌ని సొంతం చేసుకున్న భారత టి-20 సిరీస్‌పై కూడా కన్నేసింది. మరోవైపు సౌతాఫ్రికా ఈ సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత్.. సఫారీలను దెబ్బ తీసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది.
ఈ క్రమంలో ఓ స్టార్ ఆటగాడిని జట్టు నుంచి తప్పించేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో జట్టులో చోటు దక్కినా.. ఏ మాత్రం ప్రభావం చూపలేని వాషింగ్టన్ సుందర్‌ను టి-20 సిరీస్ నుంచి తప్పించేందుకు సిద్ధమైందట. అతడి స్థానంలో ఆల్ రౌండర్ శివమ్ దూబేకి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక సీమర్లుగా ఆర్ష్‌దీప్, బుమ్రా ఉంటారు. ఇక ఆల్ రౌండర్ల ప్లేస్‌లో హార్థిక్ పాండ్యా, దూబే జట్టులో ఉండే అవకాశం ఉంది.
భారత్ తుది జట్టు (అంచనా):
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూశాంసన్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
-
Home
-
Menu
