లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు: ఇద్దరు మృతి

లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు: ఇద్దరు మృతి
X

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పేరాయిపల్లి మిట్ట దగ్గర జాతీయ రహదారి 40పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 35 మంది ప్రయాణికులు మైత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని బస్సు డ్రైవర్ ఢీకొట్టింది అనంతరం వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పాండిచ్చేరికి చెందిన బద్రినాథ్, హరితగా గుర్తించారు. ఇరుక్కున్న లారీ డ్రైవర్ ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

Tags

Next Story