ఒటిటిలోకి ‘అల్లరి’ నరేష్ లేటెస్ట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

టాలీవుడ్‌లో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు ‘అల్లరి’ నరేష్‌దే. అయితే ఆ మధ్య కామెడీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. సీరియస్ సినిమాలతో ఆయన ప్రేక్షకులను పలకరించారు. అయితే అందులో ఊహించినంత పాజిటివ్ రిజల్ట్ రాలేదు. దీంతో మళ్లీ ఆయన కామెడీ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాగా, ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. స్వర్గం నుంచి రంభ ఊర్వశి మేనకలు భుమ్మీదకు వచ్చి హీరోతో ఉంటే అతడు ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడు అనేదే ఈ చిత్రం కథ. చింద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్‌గా సురభి నటించగా.. అప్సరసల్లా రాశి సింగ్, ప్రిషా సింగ్, విష్ణుప్రియలు నటించారు. వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాకి థియేటర్‌లలో మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు ఒటిటిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతుంది. మరి ‘అల్లరి’ నరేష్ చిత్రం ఒటిటిలో ఎంత మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.
-
Home
-
Menu
