‘ఆల్కహాల్’ వచ్చేది అప్పుడే

‘ఆల్కహాల్’ వచ్చేది అప్పుడే
X

విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో అల్లరి నరేష్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆల్కహాల్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.మెహర్ తేజ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మానవ ప్రవర్తనలోని విభిన్న కోణాలు, నేర ప్రవృత్తి, మనిషి తీసుకునే నిర్ణయాలు వాటి

పర్యవసానాల నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోంది.ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన రుహానీ శర్మ నటిస్తుండగా, నిహారిక ఎన్‌ఎం, సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, రఘుబాబు, వెంకటేష్ కాకుమాను, కిరీటి దమరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

Tags

Next Story