ఉత్సాహంగా అలెన్‌ వరల్డ్‌ జూనియర్ రన్‌

ఉత్సాహంగా అలెన్‌ వరల్డ్‌ జూనియర్ రన్‌
X

అలెన్‌ వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సాహంగా.. ఉల్లాసంగా జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ రన్‌లో హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ క్రీడాకారులతో సహా 180కి పైగా పాఠశాలలకు చెందిన రెండు వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. స్పాట్‌ఆన్‌ స్పోర్ట్స్‌ సంస్థ నిర్వహించిన ఈ రన్‌ను ఆసియా గేమ్స్‌ బ్రాంజ్‌ మెడలిస్ట్‌ అగసర నందిని జెండా ఊపి ప్రారంభించింది. దీనికి ముందు ఆమె మాట్లాడుతూ క్రీడల్లో అందరికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రైవేట్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌తో కలిపి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఈ రన్‌లో పాల్గొనే అవకాశం కల్పించడం గొప్ప విషయమని నిర్వాహకులు, స్పాట్‌ఆన్‌ స్పోర్ట్స్‌ సీఈఓ రోహిత్‌ మిశ్రాను నందిని అభినందించింది. పిల్లల ఉత్సాహం చూస్తుంటే వీరిలో పదేళ్ల కిందటి తన కెరీర్‌ ప్రారంభ రోజులు గుర్తు వస్తున్నాయని తెలిపింది. క్రీడలపై పిల్లల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ప్రశంసించింది. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించి ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థలు ప్రోత్సహించినప్పుడే రాష్ట్రంలో, దేశంలో క్రీడారంగం అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడింది.

రూ.3 లక్షల ప్రైజ్‌మనీ

గచ్చిబౌలిలో స్టేడియంలో మొదలైన రన్‌, టీమ్స్‌ గేటు నుంచి గోపీచంద్‌ అకాడమీ, ఐఎస్‌బీ సర్కిల్‌ మీదగా తిరిగి స్టేడియంలో ముగిసింది. 1కే కాస్ట్యూం ర‌న్‌లో పిల్ల‌ల‌తో పాటు త‌ల్లిదండ్రులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 1కే, 3కే, 5కే, 10కే విభాగాల్లో కలిపి మొత్తం రూ.3 లక్షల ప్రైజ్‌ మనీని 84 మంది క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌, అలెన్‌, డీపీఎస్‌ కొల్లూరు, పటాన్‌చెరువ్‌, అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, బిర్లా ఓపెన్‌ మైండ్స్‌, మీరుతో పాటు 180కి పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ రన్‌లో పాల్గొన్నారు.

Tags

Next Story