ఎక్కడ చూసినా రైతుల గోసే కనబడుతుంది: ఏలేటి

ఎక్కడ చూసినా రైతుల గోసే కనబడుతుంది: ఏలేటి
X

80 శాతం ధాన్యం కొన్నామనేది సిఎం గాలి లెక్కలే

రైతులపై కేసులు పెట్టడం దుర్మార్గం

సంకెళ్లు వేసిన కెసిఆర్‌కు చెప్పినట్లే.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తారు

భూపాలపల్లిలో రైతు గోస బిజెపి భరోసా పర్యటనలో బిజెపి బృందం

మన తెలంగాణ/భూపాలపల్లి జిల్లా ప్రతినిధి/గణపురం: రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసి ధాన్యం కొనకుండా రైతులను గోస పెడుతున్నదని, ఎక్కడ చూసినా రైతులు గోసే కనబడుతుందని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బిజెపి నిర్వహిస్తున్న రైతు గోస బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంలో మహేశ్వర్‌రెడ్డితో పాటు ఎంపిలు ఈటల రాజేందర్, రఘునందన్‌ రావులు పరిశీలించారు.

ఈ సందర్భంగా దాన్యం కొనుగోలు తీరును రైతులతో తెలుసుకొని మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మండలంలోనే నెల రోజులుగా ధాన్యం కొనక నిల్వలు పేర్కొని ఉన్నాయని ముఖ్యమంత్రి 80 శాతం ధాన్యం కొనుగోళ్లు చేసామని గాలి లెక్కలు చెపతున్నారని అన్నారు.

రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోగా వారు పండించిన పంటలను కొనుగోలు చేయడానికి సిద్దంగా లేకపోవడం ఘోరమైన పరిస్థితిని అన్నారు. హామీలు నెరవేర్చేదాకా వెంబడిస్తామని, మెడలు వంచి అమలు చేయిస్తామని అన్నారు. బిజెపి కదలిస్తేనే మీ యంత్రాంగం కదులుతుందని అన్నారు. కాటారంలో రైతలు నిరసన తెలిపితే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ ధాన్యం సేకరణ చేయక సిఎం, ఉత్తమకుమార్‌ రెడ్డిలు కేంద్రాన్ని బదనాం చేస్తున్నారని అన్నారు. కొనుగోళ్లపై చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

ఎంపి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనక బుకాయింపులు చేస్తే ఆనాడు రైతులకు సంకెళ్లు వేసిన కెసీఆర్ ప్రభుత్వానికి ఎలాబుద్ధి చెప్పినారో రైతులపై కేసులు పెట్టిన కాంగ్రెస్‌కు అలాగే బుద్ద్ధి చెప్తారని అన్నారు. వారి వెంట ఎమ్మెల్యేలు పైడి రాఖేష్‌రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, రామారవు పటేల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బసవ తారకరామారవు, చందుప్టల కీర్తిరెడ్డి, నిషిదర్‌ర్‌రెడ్డి, పాపన్న, దొండల రాజేందర్, కన్నం యుంగేందర్, ఉన్నారు.

Tags

Next Story