రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

Allu Arjun, Ram Charan
X

హైదరాబాద్: హీరో రామ్‌చరణ్, ఉపాసన రెండోసారి తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. వీరిద్దరికి కవల పిల్లలు జన్మించారు. ఈ సందర్భంగా ఆ దంపతులకు తోటి సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా రామ్‌చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నవ్వులతో నిండిన కుటుంబాన్ని చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారు.

‘‘మరోసారి తల్లిదండ్రులైన ఉపాసన-రామ్‌చరణ్ దంపతులకు శుభాకాంక్షలు. చిరంజీవి గారి గర్వం, ఆనందం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబం మొత్తం నవ్వుతూ కనిపిస్తుండటం సంతోషంగా ఉంది. చిన్నారులు తమ రాకతో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చారు’’ అని పేర్కొన్నారు.

Tags

Next Story