ఆలూర్ లో ఇంటి ముందు పడుకున్న వ్యక్తి హత్య

X
ఆలూర్: నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు గంగారామ్ ను కిరాతంగా హత్య చేశారు. తన ఇంటి ముందు పడుకున్న గంగారంను గురువారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో నరికి చంపినట్టు సమాచారం. గతంలో ఓ మహిళను హత్య చేసిన కేసులో గంగారం నిందితుడిగా ఉన్నాడు. మహిళా హత్య కేసులో గంగారం జైలుకు వెళ్లి వచ్చాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
-
Home
-
Menu
