ఆమనగల్లులో భార్య, కుమారుడిని కత్తితో పొడిచి చంపి... కొనఊపిరితో కుమార్తె

ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలంలో భార్య, కుమారుడిని భర్త కత్తితో పొడిచి చంపాడు. కూతురు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాం నగర్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని పులిగోనిపల్లి తండాలో బాణావత్ రాందాస్ నాయక్, కవిత అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కూతురు పవిత్ర, కమారుడు హర్షలు ఉన్నారు. ఆమనగల్లు పట్టణ సమీపంలోని సూర్యలక్ష్మి కాటన్ మిల్ లో రాందాస్ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కవిత మేస్త్రి పని కూలికి వెళ్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంది. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున భార్య, కుమారుడు, కూతురును కత్తితో పొడిచాడు. భార్య, కుమారుడు ఘటనాస్థలంలోనే మృతి చెందగా కూతురు కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
Home
-
Menu
