వెంబడించిన వీధి కుక్కలు.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి

అన్నమయ్య జిల్లా: జిల్లాలోని రాయచోటి పట్టణంలో దారణం చోటు చేసుకుంది. వీధి కుక్కలు వెంబడించడంతో బైక్ వెళ్తున్న వ్యక్తి మృత్యువాత పడ్డారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపురంలో నివాసముంటున్న ఫజిల్(42) అనే వ్యక్తి గాలివీడు రోడ్డులోని అర్బన్ పోలీస్‌స్టేషన్ సమీపం నుంచి రాత్రి 3 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో వీధి కుక్కలు ఆయన బైక్‌ను వెంబడించాయి. కుక్కల నుంచి తప్పించుకునేందుకు ఫజిల్ బైక్‌ను వేగంగా నడిపారు. దీంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న ఆలయ గోడను ఢీకొని.. అక్కడికక్కడే ప్రాణాలు కో్ల్పోయారు. సమాచారం అందుకున్న రాయచోటి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆవులు, కుక్కలు ఇష్టారీతిన రోడ్ల మీద తిరుగుతున్నా.. మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
-
Home
-
Menu
