‘ఆంధ్ర టు తెలంగాణ’.. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న మాస్ సాంగ్

స్టార్ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. ప్రతీ సినిమాలో తనదైన శైలీ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి మారి దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరీ హీరోయిన్. ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకోవడమే కాక.. రూ.100 కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. సినిమా మాత్రమే కాదు.. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
ఇందులో ‘భీమవరం బాలమా’ అంటూ సాగే పాటను నవీన్ పొలిశెట్టినే పాడగా.. ‘ఆంధ్ర టు తెలంగాణ’ అనే పాటకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను ధనుంజయ్, సమీరా భరద్వాజ్ పాడారు. ఈ పాటలో నటి శాన్వీ మేఘన తన గ్లామర్‌తో అలరించింది. చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియో సాంగ్‌ని యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది.
-
Home
-
Menu
