సర్పంచ్ పదవి కోసం అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు వదిలిన మహిళ

Panchayat elections in January
తను ఉన్న ఊరికి ఏదైనా చేయాలని ఉద్దేశంతో, ఊరి మీద ఉన్న మమకారంతో తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని (అంగన్వాడీ టీచర్) వదిలి సర్పంచ్ బరిలో దిగుతున్నారు ఓ మహిళ. యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలం, రెడ్డి నాయక్ తండా గ్రామానికి చెందిన భుక్య కళమ్మ భర్త మంజీ నాయక్ భువనగిరి సిడిపిఒ కింద రెడ్డినాయక్ తండా అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో తన ఉద్యోగానికి ఆమె రాజీనామా చేశారు. అంగన్వాడీ టీచర్ పోస్టుకు రాజీనామా చేసిన కళమ్మకు తోటి ఉద్యోగులు కన్నీటి వీడ్కోలు పలికారు. అలాగే రెడ్డి నాయక్ తండాల్లోని అంగన్వాడీ కేంద్రంలో చివరి రోజు ఆమె విధులు నిర్వహించి వెళిపోతున్న సమయంలో గర్భిణులు, బాలింతలు కలిసి కన్నీటి వీడ్కోలు పలికారు. ఊరి కోసం గత 15 సంవత్సరాల నుండి రూ.200 నుండి ఇప్పటివరకు ఉద్యోగం చేస్తూ ప్రజలకు సేవలు అందించి నేడు అదే ఊరికోసం తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా గతంలో ఇదే గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఆమె భర్త బాధ్యతలు చేపట్టగా ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్‌లో మహిళకు అవకాశం దక్కడంతో కళమ్మ తన ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్‌గా పోటీ చేయనున్నట్లు తెలిపారు.
-
Home
-
Menu
