అలరిస్తున్న హుషారైన పాట

X
anna garu vastaru movie
స్టార్ హీరో కార్తి నటిస్తున్న మూవీ ‘అన్నగారు వస్తారు’ ఈ నెల 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ‘అన్నగారు వస్తారు’ చిత్రం నుంచి ’అలాపిక్కే ఉమ్మక్’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను సంతోష్ నారాయణన్ ట్రెండీ ట్యూన్‌తో కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించి పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - ‘వలయ అహ్ కలయ, గోలయ్య, జై బాలయ్య, కలలే వలరా, గురువా నా మాటే వినరా..’ అంటూ కార్తి ఎనర్జిటిక్ స్టెప్స్‌తో ఆకట్టుకుంటోంది.
Next Story
-
Home
-
Menu
