ఎన్టీఆర్, ఎంజీఆర్ మళ్లీ ఇప్పుడు వస్తే?

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మూవీ ‘అన్నగారు వస్తారు‘ ఈ నెల 12న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్, కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో కార్తి మాట్లాడుతూ “70, 80 దశకాల్లోని మాస్ కమర్షియల్ సినిమాకు నివాళిలా డైరెక్టర్ ఈ మూవీని తెరకెక్కించారు. చిన్న స్థాయి నుంచి వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్, ఎంజీఆర్ మనకు సూపర్ హీరోస్. అలాంటి వాళ్లు మళ్లీ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ ఎంతో శ్రమకోర్చి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు”అని అన్నారు.
హీరోయిన్ కృతి శెట్టి మాట్లాడుతూ “దర్శకుడు నలన్ కుమారస్వామి ఈ చిత్రంలో ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ఆ వరల్డ్‌ను ఈ నెల 12న థియేటర్స్‌లో చూస్తారు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబీ, సందీప్ కిషన్, మధుర శ్రీధర్ రెడ్డి, బన్నీవాస్, శశిధర్, శైలేష్ కొలను, రాహుల్ రవీంద్రన్, వివేక్ ఆత్రేయ, దేవ కట్టా, శివ నిర్వాణ, వెంకీ కుడుముల, రాకేందు మౌళి తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
