కిరాయి వ్యక్తులతో అల్లుడిపై దాడి చేయించిన అత్త

X
పెనగలూరు: అన్నమయ్య జిల్లా పెనగలూరులో దారుణం చోటు చేసుకుంది. అల్లుడిపైనే ఓ అత్త కిరాయి వ్యక్తులతో దాడి చేయించింది. మునుస్వామి అనే వ్యక్తిపై నలుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాపూరు వాసి మునుస్వామి నాలుగు రోజుల క్రితం భార్యతో గొడవపడి పెనగలూరులోని తన మేనత్త ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన అత్త పెంచలమ్మ అల్లుడిపై దాడికి పురమాయించింది. రెండు బైక్‌లపై వచ్చిన కిరాయి వ్యక్తులు కత్తితో మునుస్వామి గొంతుపై దాడి చేశారు. స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. కత్తితో సహా రాజంపేట ప్రభుత్వాస్పత్రికి బాధితుడిని తరలించారు. పెనగలూరు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story
-
Home
-
Menu
