భారత్ ఫ్యూచర్ సిటిలో అన్నపూర్ణ స్టూడియో

భారత్ ఫ్యూచర్ సిటిలో అన్నపూర్ణ స్టూడియో
X

భారత్ ప్యూచర్ సిటిలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం చేయనున్నట్లు సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు నటుడు అక్కినేని నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ చాలా అద్భుతంగా ఉందని నాగార్జున ప్రశంసించారు. ఫ్యూచర్ సిటి లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఒక ప్రత్యేకమైన ఫిలిం హబ్ ను ఏర్పాటు చేసే దిశగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రణాళికలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి చోటు కల్పించడం పట్ల నటుడు నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సినిమా షూటింగ్‌లకు, నిర్మాణాలకు ప్యూచర్ సిటి ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Next Story