వచ్చే సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే..?

టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌కు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ‘సినిమా పండగ’లా భావిస్తుంటారు కాబట్టి, స్టార్ హీరోల దగ్గర యంగ్ హీరోల వరకూ.. అందరూ తమ సినిమాలను అదే సీజన్ లో రిలీజ్ చెయ్యాలని కోరుకుంటారు. పండగను టార్గెట్‌గా పెట్టుకొని సినిమాలను పూర్తి చేస్తుంటారు. 2026 పండక్కి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడంతో, వచ్చే సంక్రాంతి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కినేని హీరోల నుంచి వచ్చే ఏడాది పండక్కి ఓ సినిమా రాబోతున్నట్లు ప్రకటన వచ్చింది. 2027 సంక్రాంతికి తమ నిర్మాణ సంస్థ నుంచి ఓ సినిమా రానుందని అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియా వేదికగా తాజాగా అధికారికంగా ప్రకటించింది.
హీరో ఎవరు? డైరెక్టర్ ఎవరు? ఎప్పుడు షూటింగ్ ప్రారంభిస్తారు? వంటి ప్రాజెక్ట్ వివరాలేమీ వెల్లడించకుండా, ఏకంగా విడుదల తేదీని ప్రకటించింది. “వాసివాడి తస్సాదియ్యా.. వచ్చే 2027 జనవరి 15న సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్‌గా ఉంటది కదా. డేట్ మార్క్ చేసుకోండి” అని అన్నపూర్ణ బ్యానర్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. ఇక గతంలో నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలు సంక్రాంతికి వచ్చి ఘన విజయం సాధించాయి. ఇప్పుడు కూడా ఈ కాంబినేషన్‌లో ఒక సినిమా వచ్చే ఏడాది సంకాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. మరి పండక్కి రానున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.
-
Home
-
Menu
