రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు: బొత్స

రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు: బొత్స
X

అమరావతి: ఎపి సిఎం చంద్రబాబూ నాయుడు ఈ రాష్ట్రాన్ని రావణకాష్టం చేద్దామనుకుంటున్నారా? అని.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి, ఎవరు వద్దన్నారు? అని వైసిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడూ లైన్ తప్పి మాట్లాడలేదని, కొందరు అడ్డుకుంటే ఆయన అడ్డుకున్నారని అన్నారు. ఇంటికి వచ్చి పశ్చాత్తాపం కూడా ప్రకటించారని, జాతీయ స్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించామని తెలియజేశారు. చంద్రబాబుకు వత్తాసు పలికే జనసేన ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. సంపద సృష్టి అంటే మీ ఇంటిదా? రాష్ట్రానిదా? అని.. తడాఖా చూపిస్తామని కేంద్రమంత్రి అంటున్నారు.. ఏం చూపిస్తారు? అని నిలదీశారు.

రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు. పెట్రోల్ బాంబులు విసురుతారా? ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారా? మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదని సూచించారు. శాంతిభద్రతల వ్యవహారంలో ఇలాగేనా వ్యవహరించేది? ధ్వజమెత్తారు. ఇళ్లపై దాడులు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోలు, బాంబులు విసరమని తామెదుకు రెచ్చగొడతాం? అని ఎపి మరో బీహార్ కాకూడదు? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందెవరు? తమకు అడ్మినిస్ట్రేషన్ తెలియదా? అని ప్రశ్నించారు. తాము కూడా కోర్టుల్లో తేల్చుకుంటామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Tags

Next Story