నిజామాబాద్ లో తుపాకీతో కాల్చుకొని ఆర్ఐ సతీష్ ఆత్మహత్య

Hydra Commissioner Ranganath Gunman dead
X

నిజామాబాద్: హోంగార్డు ఆర్ఐ సతీష్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శుక్రవారం తెల్లవారుజామున ఆర్ఐ సతీష్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హోంగార్డు ఆర్ఐ గా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. నెల రోజుల క్రితం ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే. గత సంవత్సరం సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Tags

Next Story